భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పటిష్టం చేయాలి
రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా లోక్‌మంథన్ కార్యక్రమాలు చేపట్టిన పేర్కొన్న రాష్ట్రపతి
భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటానికి లోక్ మంథన్ కృషి చేస్తున్నదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్షం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం మన విధానం..అదే మన బలమని పేర్కొన్నారు. హైదరాబాద్ శిల్పారామం వేదికగా లోక్‌మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాణి రుద్రమదేవి జ్ఞాపికతో కిషన్‌రెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. 2018లో రాంచీలో లోక్‌మంథన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పటిష్టానికి ఈ ప్రయత్నం గొప్పదన్నారు. లోక్‌మంథన్‌లో పాల్గొంటున్న ప్రతిఒక్కరిని అభినందిస్తున్నాను.
ఇప్పటికీ దేశంలో బ్రిటిష్ కాలం నాటి విధానాలు కొనసాగుతున్నాయని, భారతీయతలకు అనుగుణంగా మార్చుకుంటూ వస్తున్నామన్నారు. న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేశామని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, న్యాయ సంహిత, భారతీ విద్యా విధానం , చట్టాలు అమలు చేస్తున్నామని తెలిపారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా పేర్లను మార్చామని పేర్కొన్నారు. వికసిత్ భారత్‌లో లోక్‌మంథన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. భారతీయ సంస్కృతి, ఆచారాలను నిరంతరం పటిష్టం చేయాల్సి ఉందన్నారు. దేశ ప్రజల్లో సాంస్కృతిక, స్వాభిమాన్ భావన నెలకొల్పాల్సి ఉన్నది. రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా లోక్‌మంథన్ కార్యక్రమాలు ఉన్నాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇంద్రధనస్సులో సౌందర్యాన్ని సూచిస్తుందన్నారు. గ్రామ, పట్టణ, నగర ప్రజలు ఎవరైనా మనం మొదట భారతీయ పౌరులమని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా రాష్ట్రీయ ఏక్తా భావన అనేది ప్రస్ఫుటమవుతున్నారు.ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం రాష్ట్రపతి ఢిల్లీకి పయనమయ్యారు.
కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. లోక్ మంథన్.. రాష్ట్రమే ప్రధానం నినాదంతో పనిచేసే రాజకీయేతర సంస్థ అన్నారు. సంస్కృతి, కళలు, లోక్ వ్యవస్థ గురించి లోక్‌మంథన్‌లో చర్చలు జరుగుతాయి. మూడు రోజుల పాటు మేధోమథన కార్యక్రమాలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కాలర్లు, టీచర్లు, సామాజిక కార్యకర్తలు పాల్గొంటున్నారు. రాష్ట్రీయ ఏక్తా గురించి వివరించే కుంభమేళా లోక్ మంథన్ అని కేంద్ర మంత్రి తెలిపారు. లోక్ మంథన్ ద్వారా భారతీయ సమాజానికి కొత్త దిశ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన జీవన విధానంపై చర్చలు జరగాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమస్యలు చూస్తున్నామని గిరిజనుల జీవన విధానం పలు సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందన్నారు.