India vs New Zealand: ఇండియా విజయం... పోరాడి ఓడిన న్యూజిలాండ్
భారత్ తమ ముందుంచిన 350 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి న్యూజిలాండ్ ఆటను నిదానంగా ప్రారంభించి 25 ఓవర్లలో సగం వికెట్ కోల్పోయింది. అయితే, న్యూజిలాండ్ ఆటగాళ్ళు బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ మధ్య గొప్ప భాగస్వామ్యం భారత్ ను బేంబేలెత్తించింది.
భారతదేశం vs న్యూజిలాండ్ 1వ ODI 12 పరుగులతో మ్యాచ్ భారత్ కైవసం చేసుకుంది. మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ తమ అద్భుతమైన నాక్‌లతో ఇండియా టీం ను బేంబెలెత్తించారు, అయినప్పటికీ చివరికి హైదరాబాద్‌లో ఆతిథ్య జట్టు విజేతగా నిలిచింది.
భారత్ తమ ముందుంచిన 350 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి న్యూజిలాండ్ ఆటను నిదానంగా ప్రారంభించి 25 ఓవర్లలో సగం వికెట్ కోల్పోయింది. అయితే, న్యూజిలాండ్ ఆటగాళ్ళు బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ మధ్య గొప్ప భాగస్వామ్యం భారత్ ను బేంబేలెత్తించింది. ఈ జంట ఏడవ వికెట్‌కు 162 పరుగులు జోడించారు, సాంట్నర్ 45 బంతుల్లో 57 పరుగులు సాధించాడు.సాంట్నర్ అవుటయినప్పటికీ బ్రేస్వెల్ చివరి వరకు క్రీజులో నిలబడి 78 బంతుల్లో 140 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ ఎడమచేతివాటం ఆటగాడు 12 ఫోర్లు, 10 భారీ సిక్స్ లతో భారత్ ను హడలెత్తించాడు. ఆఖరి ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన బంతికి 140 పరుగుల వద్ద ఎల్‌బీడబ్ల్యూగా చిక్కుకున్నాడు. అంతకుముందు , శుభ్‌మన్ గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేయడంతో భారత్ 50 ఓవర్లలో 349/8 భారీ స్కోరు సాధించింది.
అసలు, న్యూజిలాండ్ ఇంత దూరం వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఓ దశలో ఆ జట్టు 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే, బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్ జోడీ ఎదురుదాడికి దిగింది. దాంతో అసాధ్యమనుకున్న లక్ష్యం క్రమంగా కరిగిపోవడం ప్రారంభించింది. ఈ దశలో భారత్ భారీగా పరుగులు సమర్పించుకుంది. శాంట్నర్ 45 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అయితే శాంట్నర్ ను సిరాజ్ అవుట్ చేయడంతో భారత్ కు ఊరట లభించింది. అదే ఓవర్లో సిరాజ్... హెన్రీ షిప్లేను కూడా అవుట్ చేశాడు. ఆ తర్వాత లాకీ ఫెర్గుసన్ ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ కు పంపడంతో న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
టీమిండియా బౌలర్లలో సిరాజ్ 4, కుల్దీప్ యాదవ్ 2, శార్దూల్ ఠాకూర్ 2, షమీ 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను లక్ష్యంగా చేసుకుని విజృంభించారు. గతి తప్పిన బౌలింగ్ తో నిరాశపరిచిన పాండ్యా 7 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 21న రాయ్ పూర్ లో జరగనుంది.