ఏపీలో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Advertisement
Update:2024-11-04 19:48 IST

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ విధానంతో కొత్త క్రీడా పాలసీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఆంధ్రను క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో పాలసీని రూపకల్పన చేశారు. రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఒలింపిక్స్‌, ఆసియా గేమ్స్‌ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచాలని నిర్ణయించారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచాలని ఆదేశించారు.

ఏసియన్‌ గేమ్స్‌లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని సూచించారు. వరల్డ్ ఛాంపియన్ షిప్‌, వరల్డ్ కప్ పోటీల్లో స్వర్ణం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదించారు. అలగే స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చర్చించారు.

Tags:    
Advertisement

Similar News