బిహార్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో ప్రోత్సాహకాలు : సీఎం రేవంత్‌

సివిల్స్‌ అభ్యర్థుల్లో విశ్వాసం పెంచేందుకే ఆర్థిక సాయం చేస్తున్నమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు

Advertisement
Update:2025-01-05 12:40 IST

ప్రజాభవన్‌లో నిర్వహించిన రాజీవ్ సివిల్స్ అభయహస్తం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం అన్నారు. సివిల్స్‌ మెయిన్స్‌ ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇచ్చారు. ‘‘తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్నా రాష్ట్రం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ నుంచి సివిల్స్‌ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు.

బిహార్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించాలన్నారు. వీరంతా సివిల్స్‌లో విజయం సాధించి తెలంగాణకే రావాలని ఆకాంక్షించారు. దేశంలో వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌ నుంచి అత్యధికంగా ఐఏఎస్‌లు వస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఉపాధి, ఉద్యోగాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం. ఇందుకోసమే యువత తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ అన్యాయం జరిగిందనే పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రూప్‌ 1పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించాం. ఈ విషయంలో కోర్టులు ప్రభుత్వానికి అండగా నిలిచాయి. మార్చి 31 లోపు ఈ నియామకాలు పూర్తి చేస్తాం.’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News