తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

ఈ నెల 17న ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభం కావాల్సి ఉండింది. అయితే సడెన్ గా కేంద్ర ఎన్నికల సంఘ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

Advertisement
Update:2023-02-11 09:50 IST

ఈ నెల 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా జరగాల్సిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ నెల 17న ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభం కావాల్సి ఉండింది. అయితే సడెన్ గా కేంద్ర ఎన్నికల సంఘ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16 వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అందువల్ల సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోక తప్పలేదు.

Tags:    
Advertisement

Similar News