అశోక్‌నగర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త
అశోక్‌నగర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్1 పరీక్ష వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అభ్యర్థులు ఒక్కొక్కరిగా రోడ్డుపైకి వచ్చారు.
హైదరాబాద్ అశోక్‌నగర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్1 పరీక్ష వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అభ్యర్థులు ఒక్కొక్కరిగా రోడ్డుపైకి వచ్చి చేరారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు కూడా అక్కడికి వచ్చారు. రోడ్డుపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే ముందస్తుగానే అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించడంతో.. ఏ క్షణం ఎమ్ జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్-1 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగుతాయని, ఇందులో ఎటువంటి మార్పు ఉండదని, 95 శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం అయ్యారని అన్నారు. పటిష్ట బందోబస్తు నడుమ గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి తీరుతాం అని తేల్చి చెప్పారు.