ఆకట్టుకున్న 'అలయ్‌ బలయ్‌' సాంస్కృతిక కార్యక్రమాలు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా మొదలైన కార్యక్రమం. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, రాజకీయ ప్రముఖులు

Advertisement
Update:2024-10-13 13:23 IST

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్యక్షతన 'అలయ్‌ బలయ్‌' నిర్వహిస్తున్నారు. దత్తాత్రేయ ఢంకా మోగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారుల సంప్రదాయ డ్యాన్సులు, కోలాటం, గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పోతురాజుల విన్యాసాలు, హైదరాబాదీ సంప్రదాయ మర్ఫా వాయిద్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, ముఖ్యఅతిథిగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ గుర్మిత్‌ సింగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలంగాణ వ్యవసాయ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి తదితరుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న, మ్యూజిక్‌ డైరెక్టర్‌ వందేమాతరం శ్రీనివాస్‌ పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలయ్ బలయ్‌ కార్యక్రమంలో సర్దార్‌ దున్నపోతు ఆకట్టుకున్నది.

మనమంతా ఒక్కటనే సందేశం ఇవ్వడానికి 'అలయ్ బలయ్' గొప్ప వేదిక: సీఎం

తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి 'అలయ్ బలయ్' గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాడు రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు, సకల జనులు ఉద్యమంలో కార్యోన్ముఖులు కావడానికి కూడా అలయ్ బలయ్ ఒక కారణమని గుర్తుచేశారు.తెలంగాణలో పెద్ద పండుగ దసరా సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.గత 19 ఏండ్లుగా ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను పునరుద్ధరించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా అంటే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయి. అలాగే అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గారు గుర్తుకొస్తారు. దత్తాత్రేయ వారసురాలిగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న బండారు విజయలక్ష్మికు అభినందనలు. ప్రజా ప్రభుత్వం, పార్టీ పెద్దలంతా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మన బాధ్యత అని చాటి చెప్పారు. 

 2005 నుంచి నేటికీ విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం 

ఏటా దసరా మరుసటి రోజు 'అలయ్‌ బలయ్‌' కార్యక్రమం నిర్వహిస్తుంటారు. 2005లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. నేటికీ ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. అన్నిపార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలయ్ బలయ్ కి వచ్చే అతిథులకు ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను రుచి చూపించనున్నారు. మటన్, తలకాయ కూర, పాయ, బోటి, చికెన్, చేపల కూర, పచ్చి పులుసు, సర్వ పిండి వంటి అనేక తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు.

Tags:    
Advertisement

Similar News