ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు వల్ల బీసీలకు అన్యాయం : తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఅన్నారు. ఇవాళ సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.

Advertisement
Update:2024-10-04 20:55 IST

తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఅన్నారు. ఇవాళ సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా ఫిక్స్ చేయకుండా 10 శాతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం అమలు చేసిందని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల మొన్న జరిగిన డీఎస్సీలో అగ్రవర్గలకు వంద మందికి రావాల్సిన ఉద్యోగాలు 11వందలకు వస్తున్నాయి.. 5శాతం లేని ఈడబ్ల్యూఎస్ లేని వాళ్లకు 10 శాతం ఎలా అమలు చేస్తారని మల్లన్న ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. బీజేపీ తెచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటా తమిళ నాడు రాష్ట్రంలో లాంటి ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం లేదన్నారు.

ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల మెరిట్ తెచ్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలలో అవకాశాలు కోల్పోతున్నారు. వీరు మెరిట్‌తో ఓపెన్ కేటగిరీ‌లో జాబ్ పొందినప్పుడే, ఇదే కేటగిరీలోని కింది అభ్యర్థులకు వారి కేటగిరీలో ఉద్యోగం దక్కు తుంది. కానీ ఈడబ్ల్యూఎస్ విధానం వల్ల ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ కావాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అభ్యర్థులు కిందికి దిగి వారి రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్లవలసి వస్తుంది. ఫలితంగా కొంచం తక్కువ మార్కులు వచ్చి బోర్డర్‌లో సెలెక్ట్ కావలసిన రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు ఉద్యోగం పొందలేకపోతున్నారు. 

Tags:    
Advertisement

Similar News