రైతుల గొంతుకైనందుకు అరెస్టు చేస్తే గర్వంగా జైలుకెళ్తా

కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. అరెస్ట్‌ చేస్కో రేవంత్‌రెడ్డి అంటూ కేటీఆర్‌ సవాల్‌

Advertisement
Update:2024-11-14 11:21 IST

ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్టు చేస్తారని ఎప్పుడో తెలుసు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రైతుల గొంతుకైనందుకు అరెస్టు చేస్తే గర్వంగా జైలుకెళ్తానన్నారు. కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. అరెస్ట్‌ చేస్కో రేవంత్‌రెడ్డి అని సవాల్‌ విసిరారు. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర అంటూ తీవ్రంగా స్పందించారు. ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలుకోవడం కుట్ర కాదా? అల్లుడు, అన్న కోసం.. రైతన్న నోట్లో మట్టికొట్టడం కుట్ర కాదా? తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డున పడేయడం కుట్ర కాదా? అని నిలదీశారు. గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితానలు రోడ్డుకు ఈడ్వడం కుట్ర కదా? అని ధ్వజమెత్తారు. నీ ప్రైవేట్‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను ల్లికి, భార్యను భర్తకు దూరం చేయడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర? మర్లపడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టారని కేటీఆర్‌ ఆరోపించారు. 50 లక్షలతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగానే కనిపిస్తుందని కేటీఆర్‌ విమర్శించారు. చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో! అని రాసుకొచ్చారు. 

Tags:    
Advertisement

Similar News