నేను తుమ్మితే తుఫానే...మంత్రి మల్లా రెడ్డి
ఈ రోజు మళ్ళీ మల్లారెడ్డి తన నోటికి పని చెప్పాడు. హోలీ సందర్భంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, నేను పెద్దగా చదువుకోలే...నేను పెద్ద మేదావిని కాదు.... నేను పాలమ్మిన... పూలమ్మిన...
వివాదాస్పద వ్యాఖ్యలకు, కామెడీ మాటలకు తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి ప్రతీతి. ఆయనకు చెందిన కాలేజీల్లో విద్యార్థులనుద్దేశించి ప్రతిసారీ ఆయన మాట్లాడే మాటలు వైరలయిపోతూ ఉంటాయి. ''యువతీ యువకులు డబ్బున్న వాళ్ళను చూసి ప్రేమించండి'' అని గతంలో విద్యార్థులకు బోధించిన మల్లారెడ్డి మాటలు ఎంత వైరల్ అయ్యాయో ఎవరూ మర్చిపోరు.
ఈ రోజు మళ్ళీ మల్లారెడ్డి తన నోటికి పని చెప్పాడు. హోలీ సందర్భంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, నేను పెద్దగా చదువుకోలే...నేను పెద్ద మేదావిని కాదు.... నేను పాలమ్మిన... పూలమ్మిన... కాలేజీలు పెట్టిన... ఆస్పత్రులు కట్టిన... వేల మంది విద్యార్థులను తయారు చేసిన, దేశాన్నేలే గొప్పవాళ్ళను తయారు చేసిన...అందుకే మల్లన్న అంటే ఇంత క్రేజ్ ఉన్నది.... నేను తుమ్మితే తుఫాన్ అయితది....'' అని ఆయన అన్నారు.
ఆయన మాట్లాడుతున్నంత సేపు విద్యార్థులు, ఈలలు, కేకలు వేస్తూ మల్లారెడ్డిని ప్రోత్సహించారు. అది చూసి మల్లారెడ్డి మరింత రెచ్చిపోయి మాట్లాడాడు.
ఇదంతా చూసిన జనం మాత్రం మల్లారెడ్డికి తుమ్ములు రాకుండా చూడాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నారు.