రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యోగాలు ఊడుతాయి

ఖమ్మం మార్కెట్‌లో పత్తి ధరల పతనంపై స్పందించిన కలెక్టర్‌.. అధికారులపై ఆగ్రహం

Advertisement
Update:2024-11-12 14:10 IST

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మళ్లీ పడిపోయాయి. పత్తి ధర క్వింటాల్‌ రూ. 6,100 పడిపోయింది. వ్యవసాయమార్కెట్ఖు 20 వేల పత్తి బస్తాలు వచ్చాయి. పత్తి ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఖమ్మం మార్కెట్‌లో పత్తి ధరల పతనంపై కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్ స్పందించారు. వ్యాపారులు ఇష్టానుసారంగా పత్తి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆయనకు ఫిర్యాదు చేశారు. గిట్టుబాటు ధర రావడం లేదని కలెక్టర్‌ ఎదుట రైతులు వాపోయారు. గిట్టుబాటు ధర రాకపోవడంపై అధికారులపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెటింగ్‌ అధికారి, వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శిపై మండిపడ్డారు. రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యోగాలు ఊడుతాయని తీవ్రంగా హెచ్చరించారు.

మద్దతు ధరకంటే తక్కువగా కొంటే రైస్‌ మిల్లు సీజ్: కలెక్టర్‌ త్రిపాఠి

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకంటే తక్కువగా మిల్లర్లు ధాన్యాన్నికొనుగోలు చేస్తే నల్గొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. రైతులను మోసం చేస్తే రైస్‌ మిల్లును సీజ్‌ చేస్తామన్నారు. రైతులు ధాన్యాన్ని అమ్మడానికి రైస్‌ మిల్లులకు వెళ్లకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధరతో పాటు బోనస్‌ను కూడా పొందాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    
Advertisement

Similar News