సన్ రైజర్స్ టీమ్ లోకి తెలుగు ప్లేయర్ ని తీసుకోకుంటే మ్యాచ్ లను అడ్డుకుంటా - దానం నాగేందర్

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి తెలుగు ప్లేయర్ ని తీసుకోకుంటే ఉప్పల్ లో జరిగే మ్యాచ్ ను అడ్డుకుంటానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు

Advertisement
Update:2024-04-05 14:49 IST

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి తెలుగు ప్లేయర్ ని తీసుకోకుంటే ఉప్పల్ లో జరిగే మ్యాచ్ ను అడ్డుకుంటానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లు కేవలం పది నిమిషాల్లోనే 45 వేలు అమ్ముడుపోయినట్లు హెచ్ సీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో హెచ్ సీఏ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటోందనే ఆరోపణలు వచ్చాయి.

కాగా, దీనిపై తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ హెచ్ సీఏ తీరును తప్పు పట్టారు. 45 వేల టికెట్లు కేవలం 10 నిమిషాల్లోనే ఎలా అమ్ముడుపోతాయని దానం ప్రశ్నించారు. కాంప్లమెంటరీ పాస్ లను హెచ్ సీఏ బ్లాక్ లో అమ్ముతోందని విమర్శించారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లకు టికెట్లు దొరకకపోవడం దారుణమని అన్నారు.

హెచ్ సీఏలో జరుగుతున్న బ్లాక్ టికెట్ల దందాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. హెచ్ సీఏ తీరుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పేరుకే సన్ రైజర్స్ హైదరాబాద్ అని ఈ టీమ్ లో ఒక్క తెలుగు ఆటగాడు కూడా లేడని దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ కూడా తెలుగువాడు లేకపోవడం దారుణమని అన్నారు. హైదరాబాద్ టీమ్ లోకి తెలుగు ఆటగాడిని తీసుకోకుంటే ఉప్పల్ లో సన్ రైజర్స్-సీఎస్కే మధ్య జరిగే మ్యాచ్ ను అడ్డుకుంటానని దానం నాగేందర్ హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News