నా తప్పేంటి..? ఎలక్షన్ బదిలీలపై మహిళా ఐఏఎస్ స్పందన
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని కూడా సీఈసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో తెలంగాణ అధికారుల్లో కలకలం రేగింది. ముందుగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి ట్విట్టర్లో స్పందించారు.
తెలంగాణలో ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత రోజుల వ్యవధిలోనే ఈ వేటు పడింది. ఐఏఎస్ లు, ఐపీఎస్ లను బదిలీ చేయడంతో ఒకరకంగా తెలంగాణలో కలకలం రేగింది. కానీ ఎన్నికల కమిషన్ నిర్ణయం కావడంతో ఎవరూ స్పందించలేదు. మహిళా ఐఏఎస్ అధికారి టి.కె.శ్రీదేవి మాత్రం ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. బదిలీ విషయంలో తాను చేసిన తప్పేంటని ప్రశ్నించారు.
ఎన్నికల షెడ్యూల్ కి కొన్నిరోజుల ముందే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించింది. ఈ పర్యటనకు 3 రోజుల ముందే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టి.కె.శ్రీదేవి బాధ్యతలు తీసుకున్నారు. అదే విషయాన్ని ఆమె ట్విట్టర్లో ప్రస్తావించారు. బాధ్యతలు తీసుకున్న మూడు రోజులకే తాను ఆ శాఖలో జరిగిన విషయాలకు బాధ్యురాలిని ఎలా అవుతానని ప్రశ్నించారు. ఆమె ట్వీట్ ప్రస్తుతం తెలంగాణలో వైరల్ గా మారింది.
కలకలం రేపిన బదిలీలు..
నలుగురు కలెక్టర్లు, 10మంది ఎస్పీలు, ముగ్గురు పోలీస్ కమిషనర్లతోపాటు.. ఆబ్కారీశాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్, రవాణాశాఖ కార్యదర్శిని బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు పంపిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని కూడా సీఈసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో తెలంగాణ అధికారుల్లో కలకలం రేగింది. ముందుగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి ట్విట్టర్లో స్పందించారు.
♦