నేను పార్టీ మారను.. కేసీఆర్‌కు చెప్పిన మల్లారెడ్డి
గురువారం మల్లారెడ్డి అల్లుడు, ప్రస్తుతం మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన దుండిగల్‌లోని కాలేజీ భవనాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
దుండిగల్‌లో కాలేజీల కూల్చివేతతో తలపట్టుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డితో కలిసి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలిసారు. దుండిగల్‌లో కాలేజీ బిల్డింగ్‌ల కూల్చివేతపై కేసీఆర్‌తో చర్చించారని సమాచారం. రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసిన అంశంతో పాటు కాంగ్రెస్‌లోకి వెళ్తారన్న ప్రచారంపైనా కేసీఆర్‌కు ఆయన వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నిన్నటివరకు మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేస్తాడని చెప్పిన మల్లారెడ్డి ఇప్పుడు వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి ఎంపీ సీటు తన కొడుక్కి వద్దని మల్లారెడ్డి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
గురువారం మల్లారెడ్డి అల్లుడు, ప్రస్తుతం మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన దుండిగల్‌లోని కాలేజీ భవనాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. వేం నరేందర్ రెడ్డిని కలిసి రాజీకి ప్రయత్నించినప్పటికీ కూల్చివేతలు ఆగలేదు. దీంతో ఓ దశలో కాంగ్రెస్‌లో చేరేందుకు మల్లారెడ్డి సిద్ధపడ్డారని ప్రచారం జరిగింది. తాజాగా ఇదే అంశంపై కేసీఆర్‌ను కలిసి క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి.