ఇల్లు ఖాళీ చేయాలని హైడ్రా ఒత్తిడి.. మహిళ సూసైడ్
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా హడల్‌కి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని బలవన్మరణంకి పాల్పడింది.
హైదరాబాద్‌లో హైడ్రా భయంతో ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్‌పల్లిలోని చెరువు సమీపంలో ఉంటున్న బుచ్చమ్మ కూతుర్లకు కట్నం కింద ఇల్లు ఇచ్చింది. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారేమోనన్న భయంతో తల్లిని ప్రశ్నించగా మనస్తాపానికి గురైన బుచ్చమ్మ అత్మహత్య చేసుకుంది. అయితే హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఇండ్లు ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు ఇటీవలే హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఉరేసుకుని బలవన్మరణంకి పాల్పడింది.
మృతురాలి కుమార్తెలు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.హైడ్రా అధికారుల వేధింపుల కారణంగానే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కోడుకులు లేనప్పటికీ తన కుతురులకి బాగు ఉండాలనే ఉద్దేశంతో రూపాయి రూపాయి కూడబెట్టి ఈ ఇల్లును కొనుక్కున్నది. బిడ్డల పెళ్లిళ్లకు కట్నం కింద రాసిచ్చింది. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తాం అనేసరికి ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి హైడ్రాకు సంబంధం లేదని కమీషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు