ఆక్రమణలకు ఆస్కారం లేకుండా హైడ్రా ప్రత్యేక యాప్‌

అందులోనే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి అవకాశం కల్పించామన్నహైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

Advertisement
Update:2024-10-07 20:56 IST

ఆక్రమణలు ఎక్కడ జరిగినా క్షణాల్లో హైడ్రాకు తెలిసేలా పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు.హైదరాబాద్‌లో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లు గుర్తించడానికి ఇరిగేషన్‌, రెవెన్యూ, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ, స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులతో రంగనాథ్‌ సమీక్ష నిర్వహించారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణఖు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆక్రమణలకు ఆస్కారం లేకుండా హైడ్రా ఓ ప్రత్యేక యాప్‌ను తీసుకొస్తున్నది. అందులోనే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి అవకాశం కల్పించారు. దీని గురించి అధికారులకు ఆయన వివరించారు.

చెరువుల పరిరక్షణతో పాటు వాటికి పూర్వవైభవం తీసుకొచ్చేలా హైడ్రా కృషి చేస్తున్నదని చెప్పారు. ఆక్రమణల తొలిగింపు తర్వాత వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలిగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మొదటి దశలో ఎర్రకుంట, కూకట్‌పల్లి చెరువులో పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News