బెంగళూరుకు హైడ్రా కమిషనర్‌

చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణ అధ్యయనానికి వెళ్లిన 'హైడ్రా' అధికారులు

Advertisement
Update:2024-11-07 12:29 IST

కర్ణాటక రాజధాని బెంగళూరులో చెరువుల పునరుద్ధరణతో పాటు విపత్తు నిర్వహణపై అధ్యయనం చేయడానికి హైడ్రా కమిషనర్‌ అక్కడికి చేరుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చెరువుల పునరుద్ధరణపై అధ్యయనం చేయనున్నారు. హైడ్రా అధికారులు బుధవారమే బెంగళూరుకు వెళ్లగా.. రంగనాథ్‌ ఇవాళ వెళ్లారు. రేవంత్‌ సర్కార్‌ హైదరాబాద్‌ నగరంలోని ఐదు చెరువులను పునరుద్ధరించాలని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆ దిశగా హైడ్రా చర్యలను వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు తమ పర్యటనలో యలహంకలోని కర్ణాటక స్టేట్‌ నేచురల్‌ డిజాస్టర్‌ మానిటరింగ్‌ సెంటర్‌ను సందర్శించనున్నారు. అక్కడి సీనియర్‌ శాస్త్రవేత్తలతో విపత్తు నిర్వహణపై భేటీ అవుతారు. అనంతరం అక్కడి నుంచి సెన్సార్స్‌ సహాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలిస్తారు. బెంగళూరు కోర్‌ సిటీలో ఉన్న చెరువులను సందర్శిస్తారు. రెండో రోజు పర్యటనలో లేక్‌ మ్యాన్‌ ఆప్ ఇండియా ఆనంద్‌ మల్లిగవాడ్‌తో రంగనాథ్‌ సమావేశం కానున్నారు. కర్ణాటక ట్యాంక్‌ కన్జర్వేషన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చేసిన చెరువులను సందర్శించి అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలు, టెక్నాలజీని తెలుసుకోనున్నారు.

Tags:    
Advertisement

Similar News