ఒక అరటిపండు రూ.100 చెప్పిన హైదరాబాదీ..వీడియో వైరల్
భారత పర్యటనకు వచ్చిన హగ్ అనే ఓ రష్యన్ యాత్రికుడికి వింత అనుభవం ఎదురైంది.
Advertisement
హైదరాబాద్ నగరంలో ఓ రష్యన్ యాత్రికుడికి షాకింగ్ ఘటన ఎదురైంది. తోపుడు బండిపై అరటిపళ్లు అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి.. ఓ అరటి పండు ఎంత అని అడగ్గా.. అతడు రూ.100 అని సమాధానమిచ్చాడు. తప్పుగా విన్నానేమో అనుకొని మరోసారి అడిగినా అదే సమాధానం వచ్చింది. ఆశ్చర్యపోయిన అతడు.. అంత ధర చెల్లించలేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో వీడియోతో సహా పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. ఈ సంఘటన హైదరాబాద్‌లోనే జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అరటిపళ్లను డజన్ల లెక్కన విక్రయిస్తారు. డజను మహా అయితే.. ఓ రూ.60, రూ.70 ఉంటుంది. . ఈ ధరతో యూకేలో ఎనిమిది అరటిపండ్లు కొనుగోలు చేయవచ్చు.. కానీ ఇక్కడ మాత్రం ఒక్కటే అంటున్నారని పేర్కొన్నాడు
Advertisement