వేసవిలో హైదరాబాద్ కి నీటి కష్టాలు..! సీఎస్ ఏమన్నారంటే..?

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కరవు వచ్చిందని ఇటీవల ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన జలాశయాలన్నిటిలో నీరు అడుగంటిందని, రైతులకు నీరివ్వడంలేదని, పంటలు ఎండిపోతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Advertisement
Update:2024-03-27 12:43 IST

వేసవి ప్రారంభంలోనే బెంగళూరులో నీటి కటకట మొదలైంది. నిత్యావసరాలకు కూడా నీరు లేక అల్లాడిపోతున్నారు అపార్ట్ మెంట్ వాసులు. బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణపై కూడా ఈ ప్రభావం పడింది. పొరపాటున బైక్, కారుని నీటితో కడిగినందుకు రూ.5వేలు చేతి చమురు వదిలించుకున్నారు కొంతమంది. ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ బెంగళూరుకేనా..? హైదరాబాద్ లో రాబోయే రోజుల్లో నీటి కొరత ఉంటుందా..?

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కరవు వచ్చిందని ఇటీవల ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన జలాశయాలన్నిటిలో నీరు అడుగంటిందని, రైతులకు నీరివ్వడంలేదని, పంటలు ఎండిపోతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ దశలో హైదరాబాద్ కి కూడా తాగునీటి కష్టాలు మొదలవుతాయనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్ వాసులు ఆందోళనకు గురికావొద్దని తెలిపారు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి. రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని, వేసవిలో తెలంగాణకు తాగునీటికి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారామె.

రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన సీఎస్, తాగునీటి సమస్య తలెత్తకుండా 'సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌'కు నిధులు విడుదల చేశామని చెప్పారు. బోర్ల ఫ్లషింగ్‌, పైపుల మరమ్మతులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. క్షేత్ర స్థాయి అధికారులు, నోడల్‌ అధికారులతో ప్రతిరోజూ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. జలాశయాల్లో గతేడాది లాగే ఇప్పుడు కూడా నీటి మట్టాలు ఉన్నాయని, ఆ నీరు సరిపోయే అవకాశం ఉన్నా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్‌ రెండో వారం తర్వాత రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్‌ చేపడతామని చెప్పారు సీఎస్. హైదరాబాద్ వాసులు తాగునీటి విషయంలో ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.   

Tags:    
Advertisement

Similar News