హైదరాబాద్: మూడు సైబర్‌ క్రైమ్‌ వింగ్ లను లీడ్ చేయనున్న‌ ముగ్గురు మహిళా ఐపీఎస్‌ అధికారులు

2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి స్నేహ మెహ్రాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా, 2018 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రితిరాజ్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ గా, 2017 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి బి అనురాధను రాచకొండ సైబర్ క్రైమ్స్ డీసీపీ గా నియమించింది ప్రభుత్వం.

Advertisement
Update:2023-01-27 07:51 IST

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్లలో కొత్తగా సృష్టించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్స్) పోస్టులకు ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులు నాయకత్వం వహించనున్నారు.

2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి స్నేహ మెహ్రాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా, 2018 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రితిరాజ్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ గా, 2017 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి బి అనురాధను రాచకొండ సైబర్ క్రైమ్స్ డీసీపీ గా నియమించింది ప్రభుత్వం.

ఇంతకుముందు, సైబర్ క్రైమ్ వింగ్ లకు ACP ర్యాంక్ అధికారి నేతృత్వం వహించేవారు. కేసులలో వారి దర్యాప్తును ఉన్నత స్థాయి అధికారు పర్యవేక్షించేవారు. సైబర్‌ క్రైమ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడు కమిషనరేట్‌ల పరిధిలో సైబర్‌ క్రైమ్‌లకు ప్రత్యేక డీసీపీ పోస్టుల‌ను ఏర్పాటు చేశారు.

Tags:    
Advertisement

Similar News