పాత సామాన్ల వ్యాపారి వద్ద రూ.1.24 కోట్లు.. షాకైన పోలీసులు

అతడిది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చాడు. పాత సామాన్లు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

Advertisement
Update:2022-09-30 13:16 IST

అతడిది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చాడు. పాత సామాన్లు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడి వద్ద భారీగా సొమ్ము ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు తనిఖీలు నిర్వహించగా .. అతడి వద్ద నుంచి రూ.1.24 కోట్లు పట్టుబడ్డాయి.పాత సామాన్లు అమ్ముకునే వ్యాపారి వద్ద రూ.1.24 కోట్లు పట్టుబడటంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.

మాసబ్ ట్యాంక్ వద్ద శాంతినగర్ లో నివసించే షోయబ్ మాలిక్ పాత సామాన్లు సేకరించి వాటిని విక్రయించే వ్యాపారం చేస్తుంటాడు. అయితే అతడి వద్ద భారీగా డబ్బు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు శాంతినగర్ కు చేరుకొని మాలిక్ నివాసం వద్ద తనిఖీలు చేశారు. అక్కడ వారికి రూ.1.24 కోట్లు నగదు పట్టుబడింది. దీనిపై వారు మాలిక్ ని విచారించారు. అది హవాలా డబ్బుగా పోలీసులు గుర్తించారు.

భరత్ అనే బంధువు సూచన మేరకు మాలిక్ ఆ హవాలా డబ్బు తీసుకొని తన వద్ద దాచినట్లు పోలీసులు తెలిపారు. పాత సామాన్లు విక్రయించే వ్యక్తి వద్ద భారీ మొత్తంలో సొమ్ము ఉంచినా ఎవరికీ అనుమానం రాదని భావించి హవాలా చేసేవారు ఈ పనికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మాలిక్ వద్దకు ఆ డబ్బు చేర్చిన వ్యక్తులు ఎవరో కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News