హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్..

ఇటీవలే స్టూడెంట్ పాస్ లు కూడా జారీ చేసింది. దీంతో విద్యార్థులకు మరింత చేరువ అయింది హైదరాబాద్ మెట్రో. పాస్ ల జారీ అనంతరం జులై-3 సోమవారం ఒక్కసారిగా రద్దీ బాగా పెరిగింది.

Advertisement
Update:2023-07-04 19:40 IST

వినూత్న పథకాలు, సౌకర్యవంతమైన ప్రయాణంతో అతి తక్కువకాలంలోనే హైదరాబాద్ వాసుల జీవనగమనంలో భాగమైపోయింది మెట్రో. మెట్రో వచ్చిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు తీరడంతోపాటు, ప్రయాణ సమయం బాగా తగ్గిపోయింది. వేచి చూసే సమయం దాదాపు లేదనే చెప్పాలి. మెట్రోని హైదరాబాద్ వాసులు బాగా ఆదరిస్తున్నారని చెప్పడానికి ప్రయాణికుల సంఖ్యే నిదర్శనం. తాజాగా మెట్రోలో ఒకరోజు ప్రయాణం చేసిన వారి సంఖ్య 5.1 లక్షలకు చేరింది. ఇప్పటి వరకూ ఇదే అత్యథికం.

జులై-3న హైదరాబాద్ మెట్రో ని ఉపయోగించుకున్నవారి సంఖ్య 5 లక్షల 10వేలు. మెట్రో చరిత్రలో ఇదే అత్యథికం. ప్రతి రోజూ దాదాపుగా 5లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది మెట్రో. జులై-3 సోమవారం రోజు అత్యథికంగా 5.1 లక్షల మంది ప్రయాణంలో భాగస్వామి అయింది.

2017 నవంబర్ 29న హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తర్వాత రోజు రోజుకీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా సమయంలో రద్దీ బాగా తగ్గినా ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. దగ్గర ప్రయాణమైనా, దూర ప్రయాణమైనా మెట్రోనే ఆశ్రయిస్తున్నారు చాలామంది. నాగోల్ - హైటెక్ సిటీ, ఎల్బీనగర్ - కూకట్ పల్లి రూట్లు బాగా రద్దీగా ఉంటాయి. ఆఫీసు వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. సోమవారం ఈ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది.

ఇటీవలే స్టూడెంట్ పాస్ లు కూడా మెట్రో జారీ చేసింది. దీంతో విద్యార్థులకు మరింత చేరువ అయింది హైదరాబాద్ మెట్రో. పాస్ ల జారీ అనంతరం జులై-3 సోమవారం ఒక్కసారిగా రద్దీ బాగా పెరిగింది. సరికొత్త రికార్డ్ నమోదయింది.

Tags:    
Advertisement

Similar News