Hyderabad: మెట్రో రైల్ సిబ్బంది సమ్మె: చర్చలు విఫలం... యజమాన్యం బెదిరింపులు

ఉద్యోగులతో కొద్ది సేపటి క్రితం కాంట్రాక్ట్ యాజమాన్యం చర్చ‌లు జరిపింది. ముందు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని తర్వాత వేతనం పెంపు విషయం ఆలోచిస్తామని యాజమాన్యం చెప్పింది. అయితే యాజమాన్యం ప్రతిపాదనకు ఉద్యోగులు ఒప్పుకోక పోవడంతో చర్చలు విఫలం అయ్యాయి.

Advertisement
Update:2023-01-03 14:17 IST

వేతనాలు పెంచాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ టికటింగ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె విషయంలో యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.

ఎల్ బీ నగర్, మియాపూర్ లైన్ టికటింగ్ లో పని చేసే కాంట్రాక్ట్ సిబ్బంది ఈ రోజు ఉదయం నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. ఐదేళ్ళుగా తమకు 11 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, దానిని 18 వేలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ అమీర్ పేట రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆ లైన్ లో మొత్తం 350 మంది టికటింగ్ సిబ్బంది పని చేస్తుండగా 300 మంది సమ్మెలో పాల్గొన్నారు.

కాగా ఉద్యోగులతో కొద్ది సేపటి క్రితం కాంట్రాక్ట్ యాజమాన్యం చర్చ‌లు జరిపింది. ముందు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని తర్వాత వేతనం పెంపు విషయం ఆలోచిస్తామని యాజమాన్యం చెప్పింది. అయితే యాజమాన్యం ప్రతిపాదనకు ఉద్యోగులు ఒప్పుకోక పోవడంతో చర్చలు విఫలం అయ్యాయి. జీతాల పెంపుపై ఖచ్చితమైన హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని సిబ్బంది తేల్చి చెప్పారు.

మరో వైపు సమ్మె చేస్తున్న సిబ్బందిపై యాజమాన్యం బెదిరింపులకు దిగింది. ఉద్యోగులపై చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించింది.

Tags:    
Advertisement

Similar News