హైదరాబాద్ లో పెరుగుతున్న ధ్వని కాలుష్యం
Noise pollution in Hyderabad: 50 డెసిబెల్ ఉండాల్సిన శబ్ధ స్థాయి ఈ ఏడాది జనవరిలో గచ్చిబౌలిలో పగటిపూట 59.57 డిబిగా ఉండగా, నవంబర్ చివరి నాటికి, అదే ప్రాంతంలో శబ్దం స్థాయి 64.25 dB. ఈ నెలమొదటి వారంలో ఇది 66.83 dBకి చేరుకుంది.
కొన్ని దశాబ్దాల క్రితం వరకు, గచ్చిబౌలి ప్రశాంతతకు ఆహ్లాదకరమైన పరిసరాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ ప్రాతం సందడిగా ఉండే కార్యకలాపాలు, అంతులేని వాహనాల ప్రవాహంతో హైదరాబాద్‌లోని అత్యంత ధ్వని కాలుష్య జోన్‌లలో ఒకటిగా మారింది.
గత ఆరు సంవత్సరాలుగా, ఇక్కడ శబ్ద స్థాయిలు నిర్ణీత పరిమితుల కంటే పెరగడం ప్రారంభించాయి. ఈ సంవత్సరం నవంబర్ వరకు, గచ్చిబౌలిలో డెసిబెల్ (dB) స్థాయిలు బాగా పెరిగాయి.
50 డెసిబెల్ ఉండాల్సిన శబ్ధ స్థాయి ఈ ఏడాది జనవరిలో గచ్చిబౌలిలో పగటిపూట 59.57 డిబిగా ఉండగా, నవంబర్ చివరి నాటికి, అదే ప్రాంతంలో శబ్దం స్థాయి 64.25 dB. ఈ నెలమొదటి వారంలో ఇది 66.83 dBకి చేరుకుంది.
రాత్రి వేళల్లో 40 డెసిబెల్ ఉండాల్సి ఉండగా గచ్చిబౌలిలో 55 dB దాటింది. గత కొన్ని నెలల్లో దాదాపు 65 dB తాకింది.
మరో సెన్సిటివ్ జోన్ అయిన నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రాంతం కూడా ఇప్పుడు నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ డెసిబెల్ స్థాయిలు మార్చి నుండి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.ఇటీవలి నెలల్లో రాత్రి సమయంలో ఈ సంఖ్య 70 dBని తాకింది.
హైదరాబాద్ నివాస ప్రాంతాల్లో కూడా శబ్ద స్థాయిలు పెరుగుతున్నాయి. నవంబర్‌లో జూబ్లీహిల్స్‌లో పగటిపూట 55 డిబి ఉండాల్సిన శబ్దం స్థాయి 68.43 dB గా ఉంది. 45 డిబిలు గా ఉండాల్సిన రాత్రి సమయంలో శబ్దం స్థాయి 71.74 dB గా ఉంది. అదేవిధంగా తార్నాకలో పగటిపూట 64.96 డిబి, రాత్రి 56.53 డిబికి చేరుకుంది.
డాక్టర్ శకుంతలా ఘోష్, ENT స్పెషలిస్ట్ ప్రకారం, 85 dB లేదా అంతకంటే ఎక్కువ ధ్వనిని నిరంతరం వినడం ద్వారా వినికిడి లోపానికి దారితీయవచ్చు. "ప్రజలు తరచుగా తలనొప్పి, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం, నిద్ర భంగం కలుగుతాయి. పనిలో లేదా ధ్వని ఎక్కువగా ఉండే పరిసరాలలో రక్షిత ఇయర్‌ప్లగ్‌లు , ఇయర్ మఫ్‌లను ఉపయోగించడం వల్ల వినికిడి లోపం రాకుండా నివారించవచ్చు.'' అని ఆమె తెలిపింది.
ఇక హైద్రాబాద్ లోని మరో ప్రధాన ప్రాంతం ఆబిడ్స్ లో ధ్వని కాలుష్యం గతంలో కన్నా తగ్గింది. ఆగస్టుకు ముందు, అబిడ్స్ కూడా రాష్ట్ర రాజధానిలో అత్యంత ధ్వని కాలుష్యం ఉన్న ప్రాంతాలలో ఒకటి. ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. ఇప్పుడు అక్కడ శబ్ద కాలుష్యం ప్రభావం బాగా తక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) శబ్ద కాలుష్య నివేదిక ప్రకారం, నవంబర్‌లో, ఇక్కడ శబ్దం స్థాయిలు పగలు, రాత్రి సమయంలో 60 dB కంటే తక్కువగా ఉన్నాయి.
శబ్ద కాలుష్యాన్ని కొలవడానికి, TSPCB నగరాన్ని నివాస ప్రాంతాలు(జూబ్లీహిల్స్, తార్నాక), వాణిజ్య ప్రాంతాలు (అబిడ్స్ , JNTU), పారిశ్రామిక ప్రాంతాలు (సనత్‌నగర్, జీడిమెట్ల, గడ్డపోతారం) సున్నితమైన ప్రాంతాలు (జూ పార్క్, గచ్చిబౌలి) సహా వివిధ జోన్‌లుగా విభజించింది.