హైదరాబాద్: టెన్త్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి బ్లాక్ మెయిల్.. తోటి విద్యార్థుల దారుణం
హైదరాబాద్ శివారులోని హయత్ నగర్, వైఎస్ఆర్ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఆమెతోపాటు చదివే ఐదుగురు విద్యార్థులు ఇంట్లోకి చొరబడి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
హైదరాబాద్ లో పదవ తరగతి చదువుతున్న బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. తోటి విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ శివారులోని హయత్ నగర్, వైఎస్ఆర్ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఆమెతోపాటు చదివే ఐదుగురు విద్యార్థులు ఇంట్లోకి చొరబడి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గాన్ని వీడియో తీసి ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు.
ఈ సంఘటన ఆగస్టులో జరిగినప్పటికీ బాధితురాలు ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు వీడియో చూపించి భయపెట్టి మళ్ళీ రేప్ చేశారు. అనంతరం ఆ వీడియోను తమ ఫ్రెండ్స్ కు షేర్ చేశారు. అలా ఒకరి నుండి మరొకరికి చేరిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. ఆ వీడియోను చూసిన బాధితురాలి తల్లిదండ్రులు హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు విచారణ జరిపి నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులంతా మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నారు.