ఇదే మా డ్రీమ్ హైద‌రాబాద్‌.. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక వెల్ల‌డించిన కేటీఆర్

హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని కేటీఆర్ చెప్పారు. మెట్రోను రాబోయే 10 ఏళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే త‌మ ఎజెండా అని మంత్రి వెల్ల‌డించారు.

Advertisement
Update:2023-11-11 12:00 IST

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర ప‌రిధిలో అభివృద్ధి శ‌ర‌వేగంతో దూసుకెళుతోంది. ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌ల‌తో ట్రాఫిక్ చిక్కులు చాలావ‌ర‌కు త‌గ్గాయి. మంచినీటి కొర‌త చాలా వ‌ర‌కు త‌గ్గింది. ఇంకా చేయాల్సింది చాలా ఉంద‌న్నారు కేటీఆర్‌. త‌మ డ్రీమ్ హైదరాబాద్ ఎలా ఉండాల‌నుకుంటున్నామో చెప్పారు. హైదరాబాద్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ త‌మ భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వెల్ల‌డించారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న ఇబ్బందుల‌న్నీ తీరుస్తున్నాం

ఉమ్మడి ఏపీలో విద్యుత్, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గతంలో తరచూ విద్యుత్ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామ‌న్నారు. నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలన్నదే త‌మ స్వప్నమ‌న్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.

పొల్యూష‌న్ ప్రీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌

హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని కేటీఆర్ చెప్పారు. మెట్రోను రాబోయే 10 ఏళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే త‌మ ఎజెండా అని మంత్రి వెల్ల‌డించారు.

Tags:    
Advertisement

Similar News