లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు వాడడానికి వీలులేదు.. కోర్టు ఆదేశాలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును వాడడానికి వీలులేదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇకపై ఆమెకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయరాదని, మీడియాతో బాటు సోషల్ మీడియాలో కూడా ఏ విధమైన వ్యాఖ్యలు చేయరాదని కోర్టు ఆదేశించింది.

Advertisement
Update:2022-08-24 16:50 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్న బీజేపీకి కోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉపయోగించడానికి వీలులేదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తనకే మాత్రం సంబంధంలేని కేసులో తన పేరును ఉపయోగించకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇవ్వాళ్ళ ఆమెకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది

ఈ వ్యవహారంలో ఇకపై ఆమెకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయరాదని, మీడియాతో బాటు సోషల్ మీడియాలో కూడా ఏ విధమైన వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించింది. కవిత పేరును ప్రస్తావించరాదని సూచిస్తూ.. బీజేపీ నేతలు పర్వేశ్ వర్మ, మంజిందర్ సింగ్ లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 13 కి కోర్టు వాయిదా వేసింది.

లిక్కర్ స్కాం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేయాలనుకుంటున్న బీజేపీ నేతలకు కోర్టు ఆదేశాలు నిరాశను కలిగించాయనే చెప్పవచ్చు.





Tags:    
Advertisement

Similar News