హైద‌రాబాద్ రైల్ @ చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌

ఇక్క‌డి నుంచి 25 జ‌త‌ల ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాక‌పోక‌లు సాగించేందుకు నిర్ణ‌యించిన సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారులు రైల్వే శాఖ‌ను అనుమ‌తి కోరుతూ లేఖ‌లు పంపారు.

Advertisement
Update:2024-02-17 14:52 IST

విద్య‌, ఉపాధి, వైద్యం, వ్యాపార వ్య‌వ‌హారాల‌కు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గ‌మ్య‌స్థానంగా మారిన హైద‌రాబాద్‌కు వంద‌ల రైళ్లు వ‌చ్చి వెళుతుంటాయి. ఇందుకోసం న‌గ‌రంలో ఇప్ప‌టికే హైదరాబాద్‌, సికింద్రాబాద్, కాచిగూడ స్టేష‌న్లు ఉన్నాయి. అయినా రైళ్ల ర‌ద్దీకి అవి స‌రిపోవడం లేదు. ఈ నేప‌థ్యంలో శాటిలైట్ స్టేష‌న్‌గా న‌గ‌ర శివార్ల‌లోని చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ను సిద్ధం చేశారు.

ఇక్క‌డి నుంచి 25 జ‌త‌ల ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాక‌పోక‌లు సాగించేందుకు నిర్ణ‌యించిన సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారులు రైల్వే శాఖ‌ను అనుమ‌తి కోరుతూ లేఖ‌లు పంపారు. తాజాగా వీటిలో 3 జ‌తల ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇక్క‌డి నుంచే రాక‌పోక‌లు సాగించేందుకు అనుమ‌తులు వ‌చ్చాయి. మ‌రో 6 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్త‌గా చ‌ర్ల‌ప‌ల్లిలో హాల్ట్ ఇచ్చారు.

చ‌ర్ల‌ప‌ల్లి నుంచే బ‌య‌ల్దేరే రైళ్లు

షాలిమార్ - హైద‌రాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ హైద‌రాబాద్ నుంచి క‌ల‌కత్తా వ‌ర‌కు వెళ్లేవారికి ఎంతో ఫేమ‌స్‌. ఇక‌పై ఈ ట్రైన్ చ‌ర్ల‌ప‌ల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్ర‌ల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌, గోరఖ్‌పూర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇక్క‌డి నుంచే స్టార్ట‌వుతాయి. అలాగే అటు నుంచి వ‌చ్చే ఈ మూడు రైళ్లు కూడా చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే న‌డుస్తాయి.

ఈ రైళ్ల‌కు కొత్తగా హాల్టింగ్‌

ఇక హైద‌రాబాద్ - సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్‌, సికింద్రాబాద్ -సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్‌, సికింద్రాబాద్ -సిర్పూర్‌కాగ‌జ్ న‌గ‌ర్ భాగ్య‌న‌గ‌ర్ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌, విజ‌య‌వాడ‌- సికింద్రాబాద్ శాత‌వాహ‌న ఎక్స్‌ప్రెస్‌ల‌కు కొత్త‌గా చ‌ర్ల‌ప‌ల్లిలో హాల్ట్ ఇచ్చారు. ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లిలో ఆగ‌నున్నాయి. దీని ద్వారా చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌వారు సికింద్రాబాద్‌, హైద‌రాబాద్ స్టేష‌న్ల వ‌ర‌కు వెళ్ల‌క్క‌ర్లేకుండా చ‌ర్ల‌ప‌ల్లిలో దిగి గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌చ్చు. దీనివల్ల ప్ర‌ధాన స్టేష‌న్ల‌లో ర‌ద్దీ కూడా త‌గ్గుతుంది.

Tags:    
Advertisement

Similar News