హైదరాబాద్ : గణేష్ చతుర్థి సందర్భంగా మహిళలను వేధించిన 240 మంది అరెస్ట్

మహిళపై వేధింపులకు పాల్పడిన 240 మందిని షీ టీమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. వినాయక చవితి సందర్భంగా... మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఉద్దేశపూర్వకంగా తాకడం, వేధింపులకు గురిచేస్తున్న వారిని అరెస్టు చేసి జైలుకు పంపినట్టు అధికారులు తెలిపారు.

Advertisement
Update:2022-09-12 17:42 IST

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 240 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పది రోజుల గణేష్ ఉత్సవాల్లో ఈ అరెస్టులు జరిగినట్టు అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్స్ & సిట్) ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.

ఈ 240 మంది నిందితులు మహిళలను అనుచితంగా తాకడం, వారిని వెంబడించడం, నగరంలోని గణేష్ మండపాల‌ దగ్గర వారి ఫొటోలు తీస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా గణేష్ ఉత్సవాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఉద్దేశపూర్వకంగా తాకడం, వేధింపులకు గురిచేస్తున్న 240 మందిని రహస్య కెమెరాలతో మఫ్టీలో ఉన్న షీ టీం సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

షీ టీమ్ పోలీసులు తగిన ఆధారాలతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, ట్రయల్ కోర్టు వారికి రూ.250 జరిమానా , 2 నుండి 10 రోజుల వరకు జైలు శిక్ష విధించింది.

"ఎక్కడ ఉన్నా, ఎంత జనం మధ్య ఉన్నా స్త్రీలను వేధించే వారు షీ టీమ్‌ల కళ్ల నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదు. మహిళల‌తో అసభ్యకరంగా ప్రవర్తించే మీ అనైతిక చర్యలు దాచిపెట్టగలమనుకుంటే అది మీ అజ్ఞానం. '' అని అడిషన‌ల్ సీపీ శ్రీనివాస్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News