Hyderabad: మెట్రోరైల్ సిబ్బంది విధుల బహిష్కరణ..సమ్మె యోచనలో ఉద్యోగులు

మేనేజ్ మెంట్ తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగాలని ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఒక్క రెడ్ లైన్ సిబ్బంది మాత్రమే విధులు బహిష్కరించినప్పటికీ, మిగతా అందరిని కలుపుకొని సమ్మెకు వెళ్తామని సిబ్బంది హెచ్చరిస్తున్నారు.

Advertisement
Update:2023-01-03 13:16 IST

చాలీచాలని జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్నామని, ఐదేళ్ళుగా 11వేల రూపాయల జీతం ఇస్తున్నారని ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పెంచలేదని హైదరాబాద్ మెట్రో రైలు, టిక్కటింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనేక సార్లు మేనేజ్ మెంట్ తో మొరపెట్టుకున్నా వారి నుండి స్పందన లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఎల్ బీ నగర్, మియా పూర్ మెట్రో రైల్ లైన్ టిక్కటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.

టికటింగ్ సిబ్బంది విధుల బహిష్కరణతో ప్రయాణీకులు టిక్కట్ల కోసం రైల్వే స్టేషన్ లలో భారీ గా బార్లు తీరి ఉన్నారు.

మరో వైపు మేనేజ్ మెంట్ తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగాలని ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఒక్క రెడ్ లైన్ సిబ్బంది మాత్రమే విధులు బహిష్కరించినప్పటికీ, మిగతా అందరిని కలుపుకొని సమ్మెకు వెళ్తామని సిబ్బంది హెచ్చరిస్తున్నారు.

కాగా సిబ్బంది విధుల బహిష్కరణతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ( HMRL) అధికారులు హుటాహుటిన అమీర్ పేట‌ మెట్రో స్టేషన్ కు చేరుకున్నారు. విధులు బహిష్క‌రించిన సిబ్బంది తో చర్చలు జరుపుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News