గ్రేటర్‌లో ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణకు భారీగా నిధులు

రూ.5,492 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Advertisement
Update:2024-12-05 20:19 IST

హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మాటేవ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ (హై - సిటీ) ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు, రోడ్ల విస్తరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రేతిబౌలి, నానల్‌ నగర్‌ జంక్షన్‌లో మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ.398 కోట్లు, శేరిలింగంపల్లి జోన్‌లోని ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌, విప్రో జంక్షన్‌లలో మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్లను రూ.837 కోట్లు, జూబ్లీహిల్స్‌లోని ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌, టీవీ9 ఆఫీస్‌ వద్ద అండర్‌ పాస్‌ నిర్మాణాలకు రూ.210 కోట్లు, విరించి హాస్పిటల్‌ నుంచి జూబ్లీ చెక్‌ పోస్ట్‌ వరకు రోడ్డు విస్తరణకు రూ.150 కోట్లు, మియాపూర్‌, ఆల్విన్‌ క్రాస్‌ రోడ్‌లో ఫ్లై ఓవర్‌, అండర్‌ పాస్‌ నిర్మాణాలకు రూ.530 కోట్లు, శేరిలింగంపల్లిలో ఆర్వోబీకి రూ.124 కోట్లు, సికింద్రాబాద్‌లోని ఏవోసీ సెంటర్‌ చుట్టూ రోడ్ల నిర్మాణానికి రూ.940 కోట్లు, ఎల్‌బీ నగర్‌లోని టీకేఆర్‌ కాలేజీ జంక్షన్‌ నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూ.416 కోట్లతో పాటు ఇతర పనులకు నిధులు మంజూరు చేశారు.



Tags:    
Advertisement

Similar News