ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ

సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రుల గురుకులాలను సందర్శన నేపథ్యంలో కేటీఆర్‌ పోస్ట్‌

Advertisement
Update:2024-12-14 10:59 IST

సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ఇవాళ గురుకులాలను సందర్శించనున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. గురుకులాల్లో కామన్‌ డైట్‌ మెనూ ను సీఎం ప్రారంభించనున్నారు. అక్కడి పరిస్థితులను స్వయంగా సీఎం, మంత్రులు పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్లు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సెటైర్‌ వేశారు. బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారులో ఎట్టకేలకు చలనం వచ్చిందన్నారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చిసామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రులలో ఆవేదన రేపారని దుయ్యబట్టారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కించారు.పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రిలో బెడ్ల కోసం పోటీ పడ్డారని ఎద్దేవా చేశారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాటపట్టారని విమర్శంచారు. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు .. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండని, ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు-పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండన్నారు. కెమెరాల ముందు హంగామా చేసుడు కాదు-గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి, మంది మార్బలంతో దండయాత్ర చేయకండి- గురుకుల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండని సూచించారు. ఎట్లుండె తెలంగాణ ఎట్లాయె తెలంగాణ అని రాసుకొచ్చారు. 

Tags:    
Advertisement

Similar News