తెలంగాణ చిరకాల దాహం ఎలా తీరిందంటే.. మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ వీ. ప్రకాష్ సహా అనేక మందితో ఇంటర్వ్యూ లు చేసిన 'వైర్', కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోయినప్పటికీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం ఎలా సఫలం చేసిందో వివరించింది.
తెలంగాణలోని అనేక గ్రామాలకు సాగునీరుకానీ, తాగునీరు కానీ లేని స్థితి నుండి ఈ రోజు ఇంటింటికీ తాగునీరు, ప్రతి ఊరికి సాగునీరు అందిస్తున్న పరిస్థితి ఎలా వచ్చిందో వివరిస్తూ ప్రముఖ వెబ్ సైట్ 'ది వైర్' ఓ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ వీ. ప్రకాష్ సహా అనేక మందితో ఇంటర్వ్యూ లు చేసిన 'వైర్', కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోయినప్పటికీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు లను తెలంగాణ ప్రభుత్వం ఎలా సఫలం చేసిందో వివరించింది.
మిషన్ భగీరథ పథకం గురించి పార్లమెంటులో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పొగడ్తల వర్షం కురిపించిందని ఆ ఆర్టికల్ పేర్కొంది.
'తెలంగాణ చిరకాల దాహం ఎలా తీరిందంటే' అనే కామెంట్ తో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ఆర్టికల్ లింక్ ను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై వందల మంది నెటిజనులు స్పందిస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు మన రాష్ట్రానికి గర్వకారణమని పలువురు నెటిజనులు కామెంట్ చేయగా, నిజంగానే ఈ ప్రాజెక్టులు తెలంగాణ తరాల దాహాన్ని తీర్చాయని మరికొందరు వ్యాఖ్యానించారు.