జీహెచ్‌ఎంసీలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు ఎన్నంటే?

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10.71లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు

Advertisement
Update:2025-01-23 20:32 IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10.71లక్షల దరఖాస్తులు వచ్చాయని గృహనిర్మాణశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ వరకు 7.50లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో మిగతా 3.21లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామని తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాతే జీహెచ్‌ఎంసీలో వార్డు సభలు నిర్వహిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,249 మంది సిబ్బంది దరఖాస్తుల పరిశీలనలో పాల్గొంటున్నారని తెలిపారు.

సర్వే సిబ్బంది వివరాలు https: //indirammaindlu.telangana.gov.in/applicantSearchలో చూడొచ్చని పేర్కొన్నారు. చూడొచ్చని పేర్కొన్నారు.గతంలో దరఖాస్తు చేసుకోని వారు వార్డు సభల్లో కొత్తగా దరఖాస్తులు ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు. మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కట్టేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం.. జీహెచ్‌ఎంసీలోని 24 నియోజకవర్గాలకు 84వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. ప్రజాపాలన సభల్లో మొత్తం 10.71లక్షల దరఖాస్తులందాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోని వారు వార్డు సభలో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. మరోవైపు ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌ర ప్రక్రియ‌ అని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదేన‌ని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News