మహంకాళి ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన

కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా బంద్‌కు పిలుపు

Advertisement
Update:2024-10-19 11:04 IST

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.హిందూ సంఘాల ధర్నాలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. సికింద్రాబాద్‌ బంద్‌ పిలుపుతో సికింద్రాబాద్‌లో హోటల్స్‌, వ్యాణిజ్య సముదాయాలు ఇంకా తెరుచుకోలేదు. హిందూ సంఘాలే కాకుండా పార్టీలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నారు. మహంకాళి ఆలయం నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు.

సికింద్రాబాద్‌లో సంచలనం సృష్టించిన విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడు ఇతర మతాలపై దురుద్దేశంతోనే దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ నెల 14వ తేదీన సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌ కుమ్మరిగూడలోని దేవాలయంలోకి ప్రవేశించిన ముంబయిలోని ముమ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ వ్యవహారంపై పోలీసులు అన్నీకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుమ్మరిగూడ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి బీఏ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. 2022లో ముంబయిలోనూ ఇదే తరహా ఘటనలకు నిందితుడు పాల్పడ్డాడు. దీంతో మహారాష్ట్ర పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. 

Tags:    
Advertisement

Similar News