దామగుండంలో 'బహుజన బతుకమ్మ'కు గ్రీన్‌ సిగ్నల్‌

అనుమతి ఇచ్చిన హైకోర్టు.. బందోబస్తు కల్పించాలని ఆదేశం

Advertisement
Update:2024-10-04 18:50 IST

దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌ లో బహుజన బతుకమ్మ ఆడేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం దామగుండం రామలింగేశ్వరస్వామి ఆలయంలో బహుజన బతుకమ్మ నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. బహుజన బతుకమ్మ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. శాంతియుతంగా నిరసన తెలపడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని.. దానిని కాలరాసే అధికారం ఎవరికీ లేదన్నారు. దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌ లో రాడార్‌ సెంటర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లక్షలాది చెట్లు, పకృతి వనరులతో కూడిన దాముగుండాన్ని రాడార్‌ కేంద్రం పేరుతో విధ్వంసం చేయవద్దని ''సేవ్‌ దామగుండం జేఏసీ'' ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం బతుకమ్మ సంబరాల్లో భాగంగా బహుజన బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. బహుజన బతుకమ్మకు పర్మిషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనుమతితో ఆదివారం దామగుండంలో పెద్ద ఎత్తున బహుజన బతుకమ్మ నిర్వహించేందుకు జేఏసీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అరుణోదయ విమలక్క ఆధ్వర్యంలో నిర్వహించే బహుజన బతుకమ్మ పండులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సేవ్‌ దామగుండం జేఏసీ చైర్మన్‌ వెంకటయ్య, నాయకులు సునంద, రామన్న, సత్యన్న, గట్యానాయక్‌, శ్రీనివాస్‌ తదితరులు విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News