టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసు: బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసుల‌పై స్టే పొడిగింపు

గత నెలలో బీఎల్ సంతోష్ కు సిట్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 5వ తేదీ వరకు స్టే ఇచ్చింది. ఇవాళ్టితో ఆ స్టే ముగియనుంది. దీంతో ఇవాళ ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. బీఎల్ సంతోష్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది.

Advertisement
Update:2022-12-05 17:22 IST

టిఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై స్టేను ఈ నెల 13వ తేదీవరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

గత నెలలో బీఎల్ సంతోష్ కు సిట్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 5వ తేదీ వరకు స్టే ఇచ్చింది. ఇవాళ్టితో ఆ స్టే ముగియనుంది. దీంతో ఇవాళ ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. బీఎల్ సంతోష్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది.

తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ ప‌ర్చేందుకు బిజెపి త‌ర‌పున రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్, సింహయాజి స్వామి, మ‌ధ్య వ‌ర్తులుగా వ్య‌హ‌రించిన విష‌యం తెలిసిందే. వీరి సంభాష‌ణ‌ల్లో బిజెపి జాతీయ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి బి.ఎల్ .సంతోష్ పేరు ప్ర‌స్తావించారు. దీంతో ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు (సిట్‌) బృందం ఆయ‌న‌ను విచార‌ణ కు హాజ‌రు కావాల‌ని నోటీసులు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News