ఎన్నికల గుర్తులపై టీఆరెస్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

కారు గుర్తును పోలిన ఎనిమిది ఎన్నికల గుర్తులను రద్దు చేయాలంటూ టీఆరెస్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.

Advertisement
Update:2022-10-18 13:42 IST

మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎవరికీ కేటాయించవద్దంటూ టీఆరెస్ హైకోర్టులో వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.


రోడ్ రోలర్, రోటీ మేకర్, కెమెరా, సబ్బు పెట్టె, టెలివిజన్, పల్లకీ, కుట్టు మిషన్, ఓడ తదితర గుర్తులు కారును పోలి ఉండటంతో గతంలో కూడా కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు ఆ గుర్తులకు పడ్డాయని టీఆరెస్ ఆరోపిస్తోంది. పైగా రోడ్డు రోలర్ గుర్తును తీసివేస్తున్నట్టు 2011 లోనే ఎన్నికల సంఘం ప్రకటించి మళ్ళీ ఇప్పుడు ఆ గుర్తును కేటాయించడం పట్ల టీఆరెస్ అసంత్రుప్తిగా వ్యక్తం చేసింది.


ఈ నేపథ్యంలో ఆ గుర్తులను రద్దు చేయాలంటూ టీఆరెస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు టీఆరెస్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.




Tags:    
Advertisement

Similar News