డైలమాలో వాళ్ల ఉద్యోగాలు

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధం అన్న హైకోర్టు

Advertisement
Update:2024-11-19 16:39 IST

హైకోర్టు ఇచ్చిన ఒక్క తీర్పు వేల మంది ఉద్యోగుల జీవితాలను డైలమాలోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. వారిని రెగ్యులర్ చేస్తూ ఇచ్చిన జీవో 16ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ రాజ్యాంగ విరుద్ధమన్న హైకోర్టు ధర్మాసనం. రెగ్యులరైజ్‌ అయిన వారిని తిరిగి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా కొనసాగించ వచ్చని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్లు తెలిపారు. హైకోర్టు తీర్పు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ తీర్పుతో కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి ఏంటి, హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News