నాంపల్లి కోర్టుకు హాజరైన హీరో నాగార్జున

హీరో అక్కినేని నాగార్జున, నాగచైతన్య నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్‌ పరువునష్టం పిటిషన్‌పై సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.

Advertisement
Update:2024-10-08 15:17 IST

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, నాగచైతన్య జూబ్లిహిల్స్ నివాసం నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పిటిషన్ సంబంధించి స్టేట్‌మెంట్ న్యాయస్థానం రికార్డ్ చేసింది. హీరో నాగార్జున తరఫున వాదనలు వినిపించునున్న న్యాయవాది అశోక్ రెడ్డి. నటుడు నాగచైతన్య-సమంత విడాకులకు కారణం కేటీఆర్ అని.. నాగార్జున N కన్వెన్షన్ హాల్ విషయంలో కూల్చకుండా ఉండేందుకు కీలక ఒప్పందం కుర్చుకున్నారని.. చెప్పరాని విషయాలను మీడియాతో చెప్పింది. అనంతరం మంత్రి కొండా సురేఖ సమంతకు సారి చెప్పింది.

తాను మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం వల్లనే తాను కేటీఆర్ పై మాట్లాడాడని పేర్కొన్న విషయం తెలిసిందే. నాగార్జున పరువు నష్టం దావా పై కోర్టు తీర్పు ఎలా ఉండనుందో వేచి చూడాలి మరీ. తమ ఫ్యామిలీ గౌరవం, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ కామెంట్స్ ఉన్నాయంటూ నాగార్జున పిటిషన్‌లో తెలిపారు. పిటిషన్‌ను పరిశీలించి, వాదనలు విన్న న్యాయస్థానం అక్టోబరు 8న నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలని పేర్కొంది. దీంతో మంగళవారం ఆయన కోర్టుకు హాజరుకానున్నారు. ఇదే సమయంలో సాక్షుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయాలని న్యాయవాది అశోక్‌రెడ్డి కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News