తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Advertisement
Update:2024-10-11 16:12 IST

తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ నెలలో బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు వర్షపాతం నమోదయింది. ఈరోజు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాది కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, సూర్యాపేట,

నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదివారం నాడు వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు వర్షాలపై అలర్ట్​ చేస్తున్నా, హైదరాబాద్​​ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఏ క్షణం ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నట్టుండి ఆకాశం మబ్బులు కమ్ముతూ, అకస్మాత్తుగా వర్షం కుండపోతగా కురుస్తుంది. బయటకి వెళ్లే వారు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటు వాతావరణ శాఖ, ఇటు జీహెచ్​ఎంసీ ప్రజలకు హెచ్చరిస్తున్నారు

Tags:    
Advertisement

Similar News