ఏపీలోని ఆ జిల్లాలో భారీ వర్షాలు
రానున్న 24 గంటల్లో ఏపీలోని ఆరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఏపీలో 24 గంటల్లో ఆరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
కాకినాడ , అల్లూరి, అనకాపల్లి, విశాఖ , మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు భారీ వర్షాలు పడుతాయని స్పష్టం చేసింది. తీరం వెంబడి గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, మరో రెండు రోజులు మత్స్యకారుల చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. కళింగపట్నం-మచిలీపట్నం వరకు అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు వివరించారు.