తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రాబోయే రెండురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
Update:2024-09-25 19:10 IST

బంగాళా ఖాతాన్ని అనుకుని అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, పరిసర ప్రాంతాల్లో సగుట సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉందని తెలిపింది.

దాంతో బుధవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి మీల వేగంతో వీదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్‌లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొన్నాది

Tags:    
Advertisement

Similar News