హైదరాబాద్‌ భారీ వర్షం..మరో మూడు రోజులు వానలే

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చారించింది.

Advertisement
Update:2024-10-14 17:17 IST

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, ప్యారడైజ్, ప్యాట్నీ, పంజాగుట్ట, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, ప్రగతినగర్‌, సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్‌ జామ్ అయింది. ఉదయం చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రోడ్లపై భారీ వర్షం నీరు నిలిచిపోయింది.

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొన్నాది. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌తోపాటు నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

Tags:    
Advertisement

Similar News