తెలంగాణకు భారీ వర్ష సూచన

పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ

Advertisement
Update:2024-09-22 16:16 IST

తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తాయని తెలిపింది. వాయువ్య పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని ప్రకటించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గత రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. భువనగిరిలో అత్యధికంగా 10.3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

సోమవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయనిన తెలిపిన ఐఎండీ భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలుపడే అవకాశం ఉన్నదని తెలిపింది. వర్షాల దృష్ట్యా ఎవరూ బైటకి రావొద్దని, అత్యవసర పరిస్థితుల్లోనే రావాలని సూచించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌ బల్దియా అలర్ట్‌ అయ్యింది. ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా, రోడ్లపై నీళ్లు నిలువకుండా చర్యలు తీసుకుంటున్నది.. చిన్నపిల్లలు బైటికి రావొద్దని అధికారులు సూచించారు.

Tags:    
Advertisement

Similar News