ఇందిరా గాంధీ బతుకమ్మ ఆడుతున్న ఫొటో చూశారా?
1978లో ఇందిరా గాంధీ తెలంగాణలో పర్యటించారు. అప్పుడు వరంగల్ వచ్చిన సందర్భంలో స్థానిక మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. ఆ ఫొటోను ఇందిర మనుమరాలు ప్రియాంకా గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఊరువాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అశ్వయుజ మాసంలోని శుద్ద పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ పండుగ.. సద్దుల బతుకమ్మ రోజున ముగుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మను ఆడపడుచులు అంగరంగ వైభవంగా తీరొక్క పూలతో అలంకరించి.. ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను సమూహంగా చేర్చి ఆటలాడి ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బతుకమ్మ ఆడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
1978లో ఇందిరా గాంధీ తెలంగాణలో పర్యటించారు. అప్పుడు వరంగల్ వచ్చిన సందర్భంలో స్థానిక మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. ఆ ఫొటోను ఇందిర మనుమరాలు ప్రియాంకా గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తెలంగాణ ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు అంటూ తెలుగులో ట్వీట్ చేయడమే కాకుండా.. ఆనాడు ప్రియాంక నానమ్మ బతుకమ్మ పట్టుకొని నిలుచున్న ఫొటోను కూడా అప్‌లోడ్ చేశారు.
ఇక నాలుగవ రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అని అంటారు. ఈ రోజు గౌరమ్మను చేసి తంగేడు, ఇతర పూలతో అలంకరించి.. వాయినంగా నానబోసిన బియ్యాన్నిబెల్లంతో కానీ, చక్కెరతో కానీ ముద్దలు చేసి పెడతారు.