నార్సింగి పోలీస్ స్టేషన్ కు హరీశ్ రావు
పల్లా రాజేశ్వర్ రెడ్డిని విడిచి పెట్టకపోవడంతో ఠాణాకు మాజీ మంత్రి
Advertisement
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆవరణలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి నార్సింగి ఠాణాకు తరలించారు. రాత్రి 9.30 గంటల తర్వాత కూడా ఆయనను విడిచిపెట్టకపోవడంతో హరీశ్ రావు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తో కలిసి ఠాణాకు వెళ్లారు. పోలీసులను కలిసి పల్లాను ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు. రాత్రి పది గంటలు దాటినా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు.
Advertisement