రేవంత్ నువ్వు సీఎం అయ్యావు అంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షనే : హారీశ్‌రావు

హన్మకొండ సభలో తిట్ల పురాణం తప్ప ప్రజలకు, మహిళలకు పనికొచ్చే ఒక హామీ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Update:2024-11-20 17:39 IST

సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన చేయడం చేతకాక ఫ్రస్టేషన్‌లో తిట్ల పురాణం అందుకుంటున్నాడని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో కురుమూర్తి స్వామిని ద‌ర్శించుకున్న అనంత‌రం హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. దేవుడు, మసీదు, చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానని మాట తప్పాడు. మాటతప్పి పాలమూరు పేరు చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఆడడమే ముఖ్యమంత్రికి వెన్నుతో పెట్టిన విద్యా అని హారీశ్‌రావు అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటా అడ్డదారుల సీఎం అయ్యావు. గెలిచిన తర్వాత పేదలను రైతులను తొక్కుకుంటూ అధికారం అనుభవిస్తున్నావు. రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ విషయం తక్కువ.

రేవంత్ రెడ్డి నిన్న హన్మకొండ సభలో 50 సార్లు కేసీఆర్ పేరు జపం చేశాడు. ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఓటమి భయం మొదలై కేసీఆర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌ని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.కేసీఆర్‌కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉందన్నారు. ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షనే. కేసీఆర్ ఆదేశిస్తే మూడుసార్లు రాజీనామా చేశాను. పంద్రాగస్టు లోపల పూర్తి రుణమాఫీ నువ్వు చేసుంటే రైతుల కోసం నేను రాజీనామా చేసేవాడిని. నిన్న వరంగల్ సభలో ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమో అని ఆశపడ్డాను. పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్తాడేమో అనుకున్నాము కానీ చెప్పలేద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News