ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు హరీశ్ రావు లీగల్ నోటీస్
తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
Advertisement
కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు మాజీ మంత్రి హరీశ్ రావు తన అడ్వొకేట్ ద్వారా లీగల్ నోటీస్ పంపారు. హిమాయత్ సాగర్ ఎఫ్ టీఎల్ లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్ లో హరీశ్ రావుకు వాటాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. లీగల్ నోటీస్ అందిన 24 గంటల్లో ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ను తొలగించడంతో పాటు తన క్లయింట్ (హరీశ్ రావు)కు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. రాజ్యసభ ఎంపీగా తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకొని హుందాగా వ్యవహరించాలని సూచించారు. లేనిపక్షంలో క్రిమినల్, సివిల్ చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
లీగల్ నోటీస్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి
Advertisement