ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : హరీశ్‌ రావు

అక్రమ సంబంధాలు, చీకటి ఒప్పందాలు బయట పడుతాయని ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు

Advertisement
Update:2024-12-09 10:49 IST

తెలంగా అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ, రేవంత్‌ రెడ్డి ఫొటోతో కూడిన టీ షార్ట్స్‌ ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్‌ వారిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.

శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఆదానీ దొంగ అని, అవినీతి చేసిండని రాహుల్ గాంధీ తిడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటడని హరీష్ రావు పేర్కొన్నారు. పార్లమెంట్ లో రాహుల్, ప్రియాంకలు ఆదానీ, మోడీ బాయి బాయి అనే స్లోగన్స్ తో టీషర్ట్స్ వేసుకున్నరని మేము ఇక్కడ అదే విధంగా మీ చీకటి ఒప్పందాన్ని ప్రశ్నిస్తే తప్పేంటని హరీష్ రావు ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News